హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుల గొంతు నొక్కుతున్నారు: ఖర్గే

విద్యార్థులపై దాడి పట్ల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు. 'విద్యార్థులపై దాడి అప్రజాస్వామికం. విద్యార్థులను నేరస్తుల్లా చూడొద్దు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అరెస్టులు చేస్తున్నారు. విద్యార్థుల గొంతు నొక్కుతున్నారు' అని మండిపడ్డారు.