హైదరాబాద్: 28°C
వార్తలు

విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయి: కిరణ్ రిజిజు

విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. పేపర్ లీకేజీల నిరోధానికి చారిత్రాత్మక బిల్లు తెచ్చామని అన్నారు. పరీక్షల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నట్లు తెలిపారు. బిల్లుపై చర్చకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని కిరణ్ స్పష్టం చేశారు.