WGL: రాయపర్తి మండలం జగన్నాధపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బద్దం సుగుణమ్మ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు.
వార్తలు
ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీ


