హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యం: సీఐ

PLD: నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మహిళలు, చిన్నారుల భద్రత కోసం "శక్తి రిసెప్షన్" ఏర్పాటు చేసినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. మహిళలు, చిన్నారులు తమ సమస్యలు, ఫిర్యాదులను నిర్భయంగా, గోప్యంగా తెలియజేయవచ్చన్నారు. అందిన ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలతో పాటు కౌన్సెలింగ్ అందిస్తామని పేర్కొన్నారు.