హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వర్షాలతో రేవల్లి రహదారి దుస్థితి

WNP: భారీ వర్షంతో రేవల్లి- తలుపునూరు ప్రధాన రహదారి పలుచోట్ల గుంతలమయంగా మారింది. వర్షపు నీరు గుంతల్లో నిలిచిపోవడంతో వాటి లోతు అంచనా వేయలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే రహదారిని మరమ్మతులు చేసి, ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలన్నారు.