హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీ హామీ ఏమైంది?: రాహుల్ గాంధీ

విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'ఎక్స్'లో పోస్టు పెట్టారు. 'బీహార్‌లో ఆందోళన చేసిన విద్యార్థులపై కాల్పులు జరిపారు. తిరిగి విద్యార్థులపైనే కేసులు పెట్టారు. కేసులు ఉండవన్న ప్రధాని మోదీ హామీ ఏమైంది?. ఢిల్లీలో పెల్లెట్ తుపాకులు వాడితే.. బీహార్‌లో ఏకే-47 వాడారు. ఈ ప్రభుత్వానికి కుట్రలే తప్ప.. మంచి చేయడం తెలియదు' అని మండిపడ్డారు.