హైదరాబాద్: 28°C
వార్తలు

వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం నిత్య కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల దివ్య కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు.