BDK: బూర్గంపాడు మండలం, చింతకుంట గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ అంబులెన్స్‌లోనే ప్రసవించింది. ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది అత్యవసరంగా ప్రసవం నిర్వహించారు. తల్లి, మగ శిశువు క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఘటనతో గ్రామానికి మెరుగైన రహదారి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
అంబులెన్స్‌లోనే ప్రసవం


