RR: నందిగామ మండల కేంద్రం పాత జాతీయ రహదారిపై ఓ ఫ్యాక్టరీ ముందు ఉన్న చెట్టుకొమ్మ తెగి ఎప్పుడు ఎవరిపై పడుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని వాహనదారులు, స్థానికులు ఆరోపించారు. భారీ ఈదురు గాలులు వీస్తే చెట్టుకొమ్మ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వేలాడుతున్న కొమ్మను తీసివేయాలని కోరారు.
వార్తలు
ప్రమాదకరంగా మారిన చెట్టుకొమ్మ


