హైదరాబాద్: 28°C
వార్తలు

కూలిన హెచ్చరిక బోర్డులు

ASR: డుంబ్రిగూడ మండలంలోని బల్లుగూడ మలుపు వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు సోమవారం వీచిన గాలులకు కూలిపోయాయి. ఈ మలుపు ప్రమాదకర ప్రాంతం కావడంతో వాహనదారులను అప్రమత్తం చేసేందుకు బోర్డులు ఏర్పాటు చేశారు. అవి నేలకూలడంతో వాహనదారులకు హెచ్చరికలు కనిపించకుండా పోయాయి. ప్రమాదాలు జరగకుండా వెంటనే బోర్డులను తిరిగి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.