HYD: రేషన్కార్డు లబ్ధిదారుల ఈ-కేవైసీ పూర్తికి మరో నాలుగు రోజులే గడువుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంకా 25 శాతం మంది ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ-కేవైసీ పూర్తికాకపోతే ఆగస్టు 1 నుంచి ఇచ్చే మూడు నెలల ఉచిత రేషన్ నిలిచిపోయే ప్రమాదముందని పౌర సరఫరాల శాఖ హెచ్చరించింది. లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
వార్తలు
రేషన్ కార్డు ఈ-కేవైసీకి మరో నాలుగు రోజులే గడువు


