ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ప్రస్తుతం తనకు 79 ఏళ్లని, మరో ఏడాదిన్నర పాటు ఎమ్మెల్యేగా కొనసాగితే తన వయసు 81 సంవత్సరాలకు చేరుకుంటుందని తెలిపారు. గతంలో మాదిరిగా చురుగ్గా పని చేయలేకపోతున్నానని చెప్పారు. ఈ కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సిద్ధరామయ్య వెల్లడించారు.
వార్తలు
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను: సిద్ధరామయ్య


