హైదరాబాద్: 28°C
వార్తలు

24 రోజుల్లో 4 లక్షలు దాటిన భక్తులు!

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన 24 రోజుల్లోనే యాత్రికుల సంఖ్య 4 లక్షల మైలురాయిని అధిగమించింది. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్రలో జూలై 26 నాటికి 4.14 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర మంచులింగాన్ని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని J&K లెఫ్టినెంట్ గవర్నర్, అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు ఛైర్మన్ మనోజ్ సిన్హా 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.