MBNR: కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్‌లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గీతం పాఠశాల, పద్మాలయ పాఠశాల, పార్క్, ఊరగుట్ట ప్రాంతాల్లో పదుల సంఖ్యలో రోడ్లపై తిరుగుతూ చిన్నారులు, మహిళలు, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వెంటనే అధికారులు స్పందించి కుక్కలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
డివిజన్లో కుక్కల స్వైర విహారం


