'ఇండియా' కూటమి నేతలు ఇవాళ అత్యవసరంగా సమావేశం కానున్నారు. మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో ఫ్లోర్ స్ట్రాటజీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లుపై ఉమ్మడి వ్యూహం ఖరారు చేయనున్నారు. కాగా, ఇవాళ కేంద్రప్రభుత్వం లోక్‌సభలో పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. శనివారం డ్రాఫ్ట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
నేడు ఇండియా కూటమి అత్యవసర భేటీ


