హైదరాబాద్: 28°C
వార్తలు

గంటకు 21 మంది మృతి.. రోడ్డు భద్రతపై ఆందోళన!

దేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025లో దేశవ్యాప్తంగా 5,13,563 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అంటే.. సగటున గంటకు 59 ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాల్లో 1,83,382 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి గంటకు 21 మంది, రోజుకు సగటున 502 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.