హైదరాబాద్: 28°C
వార్తలు

గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ పోరుకు వేళాయే!

కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 5న బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగనుంది. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 16 మండలాలలోని 139 ప్రాథమిక సంఘాల అధ్యక్షులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.