KNR: సైదాపూర్ మండలం గొల్లగూడెంలో నిర్వహించిన జీపీఎల్ సీజన్-1 క్రికెట్ టోర్నీ ముగిసింది. ఫైనల్లో గొల్లగూడెం–వెంకేపల్లి సైదాపూర్ జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు సర్పంచ్ మౌనిక రూ.5,000, రన్నరప్ జట్టుకు ఉప సర్పంచ్ దుస్స కుమార్ రూ.3,000 నగదు బహుమతులు అందజేశారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని దుస్స కుమార్ యువతకు సూచించారు.
వార్తలు
గొల్లగూడెంలో జీపీఎల్-1 టోర్నీ ముగింపు


