హైదరాబాద్: 28°C
వార్తలు

NSG తొలి సారథి కన్నుమూత

దేశంలోనే అత్యంత శక్తిమంతమైన ఉగ్రవాద నిరోధక సంస్థగా పేరొందిన జాతీయ భద్రతా దళానికి (NSG) తొలి అధిపతి, మాజీ ఐపీఎస్ ఆర్.టి నాగ్రాని (98) తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని నివాసంలో కన్నుమూశారు. 1951 ఐపీఎస్ (ఏపీ క్యాడర్) బ్యాచ్‌కు చెందిన నాగ్రాని.. బ్లాక్ క్యాట్స్ కమాండో దళానికి రూపకల్పన చేసి, రెండేళ్లపాటు (1984-86) నాయకత్వం వహించారు.