హైదరాబాద్: 28°C
వార్తలు

పిడుగుపాటుకు గేదె మృతి

JGL: కోరుట్లమండలంలోని ధర్మారం గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన పిడుగులతో కూడిన భారీ వర్షంలో పిడుగుపాటుకు రైతు దోడ మహేష్‌కు చెందిన గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మృతిచెందిన గేదె విలువ సుమారు రూ.65 వేల వరకు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. జీవనాధారమైన గేదె కోల్పోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధిత రైతును ప్రభుత్వ ఆదుకోవాలని అన్నారు.