PDPL: ఎలిగేడు మండలం ముప్పిరితోట, సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల, గట్టపల్లి, కనుకుల, మారుతీనగర్ గ్రామాల్లో ఇటీవల అనారోగ్యం, ప్రమాదాలతో పలువురు మృతి చెందారు. ఆదివారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు గ్రామాల్లో పర్యటించి, మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వార్తలు
బాధిత కుటుంబాలకు ప్రభుత్వ విప్ పరామర్శ


