యూపీలోని చిత్రకూట్ జిల్లాలో నీట్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు జితేంద్ర అలియాస్ భోలాను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి, అరెస్ట్ చేశారు. మడ్ఫా అడవుల్లో నిందితుడు దాక్కున్నాడనే సమాచారంతో కూంబింగ్ నిర్వహించగా అతను పోలీసులపై కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన అధికారులు తిరిగి కాల్పులు జరపడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
వార్తలు
నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ఎన్‌కౌంటర్


