BDK: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ములకలపల్లి మండలంలో సోమవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.46 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, ప్రహరీ గోడల పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.
వార్తలు
ఎమ్మెల్యే జారె రేపటి పర్యటన వివరాలు


