GNTR: తాడేపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మేకా పుల్లారెడ్డి(72) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతదేహానికి గుంటూరు పార్లమెంట్ మాజీ ఇన్‌ఛార్జ్ మాదల రాజేంద్రతో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాడేపల్లిలో టీడీపీ బలోపేతానికి పుల్లారెడ్డి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.
వార్తలు
టీడీపీ సీనియర్ నేత పుల్లారెడ్డి కన్నుమూత


