హైదరాబాద్: 28°C
వార్తలు

ఓపెన్ స్కూల్‌లో చేరేందుకు చివరి అవకాశం

VKB: తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో సార్వత్రిక దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 29లోపు దిర్సంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దరఖాస్తు చేసుకోవచ్చని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎం. రూప్ సింగ్ తెలిపారు. మరిన్ని వివరాలకు 85018 62351, 85005 54174 నంబర్లను సంప్రదించాలని సూచించారు.