హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు పార్లమెంటులో కొత్త చట్టాన్ని ప్రవేశపెడతాం: మోదీ

పేపర్ లీకేజీలపై విచారించేందుకు ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. పరీక్షల సంస్కరణలపై కొత్త చట్టాన్ని రేపు పార్లమెంటులో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఇకపై విశ్వసనీయమైన, పారదర్శకమైన పరీక్ష విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పరీక్షల నిర్వహణలో అత్యున్నతమైన టెక్నాలజీని అవలంభిస్తామని తెలిపారు.