హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం చంద్రబాబుకు ఉద్యోగుల కృతజ్ఞతలు

GNTR: మంగళగిరిలోని CK కన్వెన్షన్‌లో డీఎస్సీ–2003 ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో ‘థాంక్యూ సీఎం సార్’ కృతజ్ఞత సభ నిర్వహించారు. G.O.Ms.No.53 ద్వారా పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేసినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.