TPT: శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా పోటీలను ఆదివారం శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ యోగాసనాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగా ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు.
వార్తలు
యోగా పోటీలు ప్రారంభం


