హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్సవానికి సిద్ధం చేస్తున్న ఆకు, కాయగూరలు

NDL: ఆషాఢ మాసం సందర్భంగా మహానందిలోని శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు సోమవారం ఆకు, కాయగూరల శాకంబరీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలంకారానికి అవసరమైన ఆకుకూరలు, కాయగూరలను ఆదివారం ఆలయానికి తీసుకువచ్చారు. స్థానిక కళ్యాణ మండపంలో మహిళలు ఆకుకూరలతో దండలు అల్లగా, వరుసగా మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వేద పండితులు తెలిపారు.