హైదరాబాద్: 28°C
వార్తలు

రేపటి నుంచే 'డోర్‌ టూ డోర్‌' కార్యక్రమం: పల్లా

AP: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రేపటి నుంచి 45 రోజుల పాటు 'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ 'డోర్‌ టూ డోర్‌' కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.