భారత కరెన్సీపై నేపాల్ కీలక ప్రకటన చేసింది. గతంలో రూ.100 నోట్లను మాత్రమే అనుమతించిన ఆ దేశం.. తాజాగా రూ.200, రూ.500 నోట్లు కూడా వినియోగించవచ్చని చెప్పింది. భారత్‌లో పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ.100 నోటును మాత్రమే నేపాల్ అనుమతిస్తూ వస్తోంది. ఇక నుంచి 2016 NOV లేదా ఆ తర్వాత జారీ చేసిన రూ.200, రూ.500 భారత కరెన్సీని కూడా అనుమతిస్తామని నేపాల్ రాష్ర్ట బ్యాంక్ ప్రతినిధి తెలిపారు.
వార్తలు
భారత కరెన్సీపై నేపాల్ కీలక ప్రకటన


