హైదరాబాద్: 28°C
వార్తలు

వసతిగృహంలో విద్యార్థుల సంఖ్యపై చర్చ..!

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం చర్చనీయాంశమైంది. సమాచారం ప్రకారం 15 గదులున్న హాస్టల్‌లో ప్రస్తుతం సుమారు 30 మంది విద్యార్థులు మాత్రమే ఉంటుండగా, పదో తరగతి చదువుతున్న వారు ఇద్దరే ఉన్నట్లు తెలుస్తోంది. ఖాళీ వసతులను అవసరమైన ఇతర ప్రభుత్వ శాఖలకు వినియోగించాలని స్థానికులు సూచిస్తున్నారు.