JGL: గొల్లపల్లి మండలంలోని మల్లన్న పేట గ్రామానికి చెందిన బుర్ర శ్రీధర్ (28) అదృశ్యమయ్యాడు. శనివారం ఉదయం 7 గంటల నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 5.5 అడుగుల ఎత్తు, చామన చాయ కలిగి ఉంటాడని, మిస్సింగ్ సమయంలో బ్లాక్ టీ షర్ట్, ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. తల్లి భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి కేసు నమోదు చేశారు.
వార్తలు
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు


