MDK: శివంపేట మండలంలోని తీవ్ర అనారోగ్యంతో మనస్తాపానికి గురైన ఉషగారి ఆంజనేయులు (40) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో విషం తాగిన ఆయనను కుటుంబ సభ్యులు సూరారంలోని నారాయణ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వార్తలు
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య.


