ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా నిలిచిన భారత యువ సంచలనం అనాహత్ సింగ్‌ను ప్రధాని మోదీ అభినందించారు. అనాహత్ విజయం దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఈ ఘనత భారత స్క్వాష్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని ప్రశంసించారు. కొత్తతరం క్రీడాకారులకు ఈ విజయం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. యువతలో స్క్వాష్ క్రీడపై ఆసక్తిని మరింత పెంచుతుందని పేర్కొన్నారు.
వార్తలు
అనాహత్ విజయం దేశ యువతకు స్ఫుర్తిదాయకం: మోదీ


