హైదరాబాద్: 28°C
వార్తలు

లోకేష్ రాజీనామా చేయాలి: మాజీ మంత్రి

ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, ఒక్కో పోస్టును మంత్రి లోకేష్ రూ. 30 లక్షలకు అమ్ముకున్నారని మాజీ మంత్రి భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. విద్యాశాఖను ఆయన అవినీతిమయం చేశారని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ..కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.