హైదరాబాద్: 28°C
వార్తలు

కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు: మాజీ సీఎం

2028 నాటికి తన రాజకీయ ప్రస్థానం 50 ఏళ్లకు చేరుకుంటుందని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని.. దశాబ్దాల కాలంలో ఎన్నో విజయాలు, ఓటములు చవిచూశానన్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తాను నమ్మిన సూత్రాలకు విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.