హైదరాబాద్: 28°C
వార్తలు

నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: జోషి

తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నియమితులైన ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీకి జోషి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. ఇవాళ్టి నుంచి విద్యా శాఖ అదనపు బాధ్యతలను కూడా స్వీకరించారు.