హైదరాబాద్: 28°C
వార్తలు

వైభవంగా ఆగస్తీశ్వర స్వామి వేడుకలు

CTR: పుంగనూరు నెక్కుంది గ్రామ సమీపంలోని కొండపై ఉన్న శ్రీ ఆగస్తీశ్వర స్వామి వారి కుంభాభిషేక మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అర్చకులు తెలిపారు. ఈ నెల 27న గణపతి ప్రార్థన, పుణ్యాహవాచనం, కలశ స్థాపన నిర్వహించనున్నారు. 28న ఏకాదశ రుద్రాభిషేకం, కలశ పూజ, వరుణ జపం, హోమం, కుంకుమార్చన, బిల్వార్చన, 29న గంగాపూజ, కుంభాభిషేకం, నవగ్రహారాధన, పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి.