హైదరాబాద్: 28°C
వార్తలు

ఛైర్మన్ వెంకటరమణకు ఉప్పర కులస్తుల ఘన సన్మానం

సత్యసాయి: రాష్ట్ర ఉప్పర సగర కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటరమణను మేకలపల్లి గ్రామానికి చెందిన ఉప్పర కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తమ సామాజిక వర్గానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వెంకటరమణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదెప్ప, సర్పంచ్ పరంధామ, శివప్ప, తదితరులు పాల్గొన్నారు.