హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించాలని విజ్ఞప్తి

ELR: కొయ్యలగూడెం మండలం పరింపూడిలోని తారక రామారావు నగర్ ఎస్సీ, ఎస్టీ కాలనీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని నివాసితులు కోరుతున్నారు. ఈ రహదారి గుండా నిత్యం పాఠశాల బస్సులు, విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నామన్నారు.