హైదరాబాద్: 28°C
వార్తలు

పశువైద్యశాల మందుబాబులకు అడ్డా

KRNL: దేవనకొండ ప్రభుత్వ పశువైద్యశాల ఆవరణ కాంపౌండ్ వాల్, గేటు లేకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో మద్యం సీసాలు కనిపిస్తుండటంతో వైద్యం కోసం వచ్చే పశువులకు ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. భవనానికి పెయింటింగ్ కూడా వేయలేదని, అధికారులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.