హైదరాబాద్: 28°C
వార్తలు

భక్తిశ్రద్ధలతో రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవం

ATP: గుత్తి కోటలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఆదివారం బోనాలు ఉత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. 101 మంది మహిళలు తలపై బోనాలను పెట్టుకుని ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.