తమిళనాడులోని సెంగళమట్టి గ్రామంలో అక్రమ బాణాసంచా తయారీ షెడ్డులో భారీ పేలుడు సంభవించింది. శివకాశి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రసాయనాలు కలుపుతున్న సమయంలో రాపిడి కారణంగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
వార్తలు
భారీ పేలుడు.. ఇద్దరు మృతి


