హైదరాబాద్: 28°C
వార్తలు

'రేపు రెవెన్యూ భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

సత్యసాయి: పుట్టపర్తిలో రేపు జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలలో పరిష్కారం కాని సమస్యలపైనే ప్రజలు జిల్లా కేంద్రానికి రావాలని సూచించారు. "meekosam.ap.gov.in" వెబ్‌సైట్ ద్వారా లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100కు ఫోన్ చేసి కూడా దరఖాస్తుల స్థితిని తెలుసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.