హైదరాబాద్: 28°C
వార్తలు

వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. రేపు పారాదీప్-సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంట గంటకు 55-65 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది.