రాత్రివేళలో భారత్ ఎంత అద్భుతంగా దర్శనమిస్తుందో తెలిపే ఓ టైమ్ లాప్స్ వీడియోను నాసాకు చెందిన అంతరిక్ష కేంద్రం రిలీజ్ చేసింది. భారత్‌తో పాటు శ్రీలంక తీర ప్రాంతాలు వీడియోలో దర్శనమిస్తున్నాయి. మన్నార్ సింధు శాఖ, బంగాళాఖాతం తీరప్రాంతంపై ఉరుములు, మెరుపులతో కూడిన మేఘాలు వెలుగులతో కనిపించాయి. నగరాల వెలుగులు, తుపాను మెరుపులు తీరప్రాంతాల్లో మాయా ప్రపంచాన్ని సృష్టించాయి.
వార్తలు
నగరాల వెలుగుల్లో మెరిసిన భారత్!


