హైదరాబాద్: 28°C
వార్తలు

డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి: వసీం

ATP: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మేయర్ మహమ్మద్ వసీం డిమాండ్ చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి పరీక్షల విధులు అప్పగించడం, వారికే టాప్ ర్యాంకులు రావడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.