AP: మడ అడవులు మానవాళికి తొలి రక్షణ కవచమని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. అసాధారణ పర్యావరణ మార్పుల నుంచి తీర ప్రాంత ప్రజలను అవి కాపాడతాయని పేర్కొన్నారు. తుపానులు, పెనుగాలుల ఉద్ధృతి, సముద్ర కోత వంటి తీవ్రమైన పరిస్థితుల నుంచి మానవాళిని రక్షిస్తాయని తెలిపారు. అంతర్జాతీయ మడ అడవుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వాటి ఆవశ్యకతపై పవన్ ఈ మేరకు 'x'లో ట్వీట్ చేశారు.
వార్తలు
'మానవాళికి రక్షణ కవచం మడ అడవులు'


