హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో 86 శాతం డిజిటలైజేషన్ పూర్తి!

NLG: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా డిజిటలైజేషన్ ప్రక్రియ 86.10 శాతం పూర్తైంది. జిల్లాలోని 15,16,253 మంది ఓటర్లలో 13,05,543 మంది వివరాలు ఇప్పటికే డిజిటలైజ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతానికి పైగా పురోగతి నమోదవుతుండగా, పట్టణాల్లో మాత్రం 80 శాతం వద్దే కొనసాగుతోంది. మ్యాపింగ్ పూర్తి చేసేందుకు మరో 8 రోజుల గడువు మాత్రమే ఉంది.